News May 19, 2024

UPDATE.. తూప్రాన్: పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు అన్న మృతి

image

తూప్రాన్ మండలం యావపూర్ వద్ద జరిగిన <<13277126>>రోడ్డు ప్రమాదం<<>>లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన కర్రె నర్సింలు(40) మృతి చెందాడు. నరసింహులు తమ్ముడి వివాహం రేపు జరగాల్సి ఉండగా ఏర్పాట్లలో ఉన్నారు. నర్సింలు, బంధువు పోచయ్య ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తున్నారు. తమిళనాడుకు చెందిన సతీష్ కుమార్, మోహన్ సైతం బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీ కొట్టగా, తీవ్రంగా గాయపడ్డారు.

Similar News

News December 29, 2025

క్వార్టర్ ఫైనల్‌కు మెదక్ జిల్లా జట్టు

image

మనోహరాబాద్‌లోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న పదవ తెలంగాణ అంతర్ జిల్లాల సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలో మెదక్ జిల్లా జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, జగిత్యాల, హనుమకొండ, హైదరాబాద్, మంచిర్యాల, నిర్మల్ జట్లు సైతం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి

News December 28, 2025

‘మేకిన్ మల్కాపూర్’ 380 వారాలుగా స్వచ్ఛభారత్

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఆదర్శ గ్రామమైన మల్కాపూర్‌లో 380 వారాలుగా స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ‘మేకిన్ మల్కాపూర్’ నినాదంతో యువత గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్న గ్రామంగా ఎంపిక కావడంతో గ్రామస్థులు మరింత శ్రమిస్తున్నారు. సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ ప్రతినిధులు, అధికారులు కలిసి శుభ్రత పనులను చేపట్టారు.

News December 28, 2025

పార్లమెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న మెదక్ విద్యార్ధి

image

పార్లమెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యార్ధి పాల్గొన్నారు. కేంద్ర విద్యా శాఖ(NCERT) ఢిల్లీచే ఎంపిక చేసి పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనడానికి పాపన్నపేట మండలం లింగాయపల్లి చీకోడ్ విద్యార్థి ఏ.శివ చైతన్య, ఉపాధ్యాయుడు ఆర్.కిషన్ ప్రసాద్‌ను ఆహ్వానించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల.. విద్యార్థి, ఉపాధ్యాయుడిని అభినందించారు.