News May 19, 2024
ADB: ట్రిపుల్ తలాక్ కేసులో రిమాండ్

తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఆదిలాబాద్ KRK కాలనీకి చెందిన షేక్ అతీక్‌ను రిమాండ్‌కు తరలించినట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. భార్యకు వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెబుతూ వాయిస్ మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని ఆదిలాబాద్ జె.ఎఫ్.సి.ఎం కోర్టు న్యాయమూర్తి ఎస్.మంజుల ముందు ఆదివారం ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని సీఐ వెల్లడించారు.
Similar News
News September 13, 2025
ADB: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ జె.సంగీత పేర్కొన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ ఉర్దూ మీడియంలో 17, ఇంగ్లీష్ మీడియంలో 49, తెలుగు మీడియంలో 56, ఫిజికల్ సైన్సెస్‌లో 20 సీట్లు ఉన్నట్లు తెలిపారు.
News September 12, 2025
ADB: ‘ఎన్నికల హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలి’

మధ్యాహ్న భోజన పథకం బిల్లుల నిర్వహణను యుకుబేర్ నుంచి మినహాయించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న అన్నారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ సీఐటీయూ ఆఫీస్‌లో మాట్లాడారు. కార్మికుల పెండింగ్ బిల్లులతోపాటు వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం కార్మికులకు పదివేల వేతనం అమలు చేయాలని పేర్కొన్నారు.
News September 12, 2025
ADB: ‘అంగన్వాడీలో సౌకర్యాలు ఉండేలా చూడాలి’

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతపై చర్చించారు. అంగన్‌వాడీ భవనాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి అవసరమైన సౌకర్యాలు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.