News May 19, 2024
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

కర్నూలులోని 44 నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరుకు చెందిన పాండు స్థానికంగా ఉన్న ఓ మహిళా ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కూరగాయలు తీసుకువచ్చేందుకు రోడ్డుపైకి వచ్చిన పాండును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో పాండు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 21, 2026
కర్నూలు: ఊ అంటుందా. ఊఊ అంటుందా?

ఆదోని జిల్లా కోసం పట్టణంలో భారీగా నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరులో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఈనెల 24న ఆ 5 నియోజకవర్గాల్లో బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్ తర్వాతైనా ప్రభుత్వం ప్రత్యేక జిల్లాకు ఊ కొడుతుందా లేక ఊఊ అంటుందా చూడాలి.
News January 21, 2026
కర్నూలు: ఎయిడెడ్ పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ విడుదల

కర్నూలు జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి డీఈవో సుధాకర్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దుపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల్లో ఈనెల 27 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 21, 2026
ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలోని రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పంటలో రైతులకు అధిక దిగుబడి, లాభాలు వచ్చేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి పాల్గొన్నారు.


