News May 19, 2024
గంపలగూడెంలో విద్యుత్ షాక్.. భార్యాభర్తల మృతి

గంపలగూడెం పడమట దళితవాడకు చెందిన గోరంట్ల తిరపయ్య, భార్య జమలమ్మలు షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి రేకుల షెడ్డుపై ఉన్న సర్వీస్ వైరుకు, బట్టల ఆరేసుకునే జీఐ వైర్ దగ్గరగా ఉండటంతో షాక్ వచ్చింది. అయితే బట్టలు తీసే ప్రయత్నంలో జములమ్మ (48) షాక్‌కు గురికాగా, గమనించిన భర్త తిరుపతయ్య (52) భార్యను కాపాడే ప్రయత్నం చేయగా ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News February 28, 2026
కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
News February 28, 2026
కృష్ణా: పర్యావరణ పరిరక్షణకు కలెక్టర్ పిలుపు

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజి శనివారం సైకిల్‌పై విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నివారణ కోసం ప్రతి శనివారం ఉద్యోగులందరూ నడక లేదా సైకిల్ ద్వారానే కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ స్వయంగా సైకిల్ తొక్కడం అందరిలోనూ స్ఫూర్తిని నింపింది.
News February 28, 2026
మినుము, పెసల కొనుగోలుకు సర్వం సిద్ధం: కృష్ణా జిల్లా జేసీ

రబీ సీజన్ అపరాల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ శుక్రవారం ప్రకటించారు. క్వింటా మినుములకు రూ.7,800, పెసలకు రూ. 8,768 మద్దతు ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం ద్వారానే విక్రయాలు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.


