News May 20, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు రేపే లాస్ట్: ఆర్ఐవో

image

ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటి వరకు ఫీజు చెల్లించ లేకపోయిన విద్యార్థులు సోమవారం చెల్లించాలని ఆర్ఐవో ఆదూరి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో తత్కాల్ పథకం కింద రూ.3000 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించడానికి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందన్నారు. SHARE IT..

Similar News

News November 1, 2025

పంటలకు ఆర్థిక సాయం పెంపు : మంత్రి కొలుసు

image

పంటలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గతంలో ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లు కేటాయించగా.. తాము రూ.6 వేల కోట్లకు పెంచామన్నారు. మామిడికి రూ.260 కోట్లు, పొగాకు రూ.273 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, కాఫీకి కిలోకు రూ.50 చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటె.. తమ ప్రభుత్వం 53.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.

News October 31, 2025

శిర్డీలో వేమిరెడ్డి దంపతులు

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు శిర్డీకి వెళ్లారు. బాబాను శుక్రవారం దర్శించుకున్నారు. సాయినాథుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

News October 31, 2025

కండలేరుకు నిధులు ఇవ్వాలని వినతి

image

కండలేరులో 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించి 30 ఏళ్లు అవుతోంది. దీన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ తెలిపారు. డ్యాం సాధారణ మెయింటెనెన్స్‌కు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు ఆయన వినతిపత్రం అంందజేశారు.