News May 20, 2024

ముగిసిన లీగ్ దశ.. రేపటి నుంచి నాకౌట్ మ్యాచ్‌లు

image

ఐపీఎల్-2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెర లేవనుంది. KKR, SRH, రాజస్థాన్, RCB ప్లే ఆఫ్స్‌కి చేరాయి. మే 21న అహ్మదాబాద్‌లో జరగనున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో KKR, SRH, మే 22న ఎలిమినేటర్‌లో RCB, రాజస్థాన్ పోటీ పడతాయి. మే 24న క్వాలిఫైయర్-2లో ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టుతో తలపడుతుంది. మే 26 చెన్నైలోని చెపాక్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Similar News

News January 10, 2026

సుధామూర్తి చెప్పిన పేరెంటింగ్ సూత్రాలు

image

ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది సవాలుగా మారుతోంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు చాలా విషయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం, పుస్తకాలు చదివించడం, సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పడం, పెట్టాల్సిన చోట హద్దులు పెడుతూనే ఇవ్వాల్సిన చోట స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు పిల్లలకు పేరెంట్స్ రోల్‌మోడల్‌లా ఉండాలంటున్నారు.

News January 10, 2026

అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల

image

AP: అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రాజధానిలోనే జగన్ ఇల్లు, పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. CBN ఇంకా అక్రమ నివాసంలో ఉన్నారు. పాలనా వికేంద్రీకరణలోనూ అమరావతిని తక్కువ చేయలేదు’ అని తెలిపారు.

News January 10, 2026

పసుపు ఉడకబెట్టే ప్రక్రియలో కీలక సూచనలు

image

పసుపు దుంపలను తవ్విన 2 నుంచి 3 రోజుల్లోపలే దుంపలను ఉడికించాలి. దీనివల్ల మంచి నాణ్యత ఉంటుంది. ఆలస్యమైతే నాణ్యత తగ్గుతుంది. పసుపు దుంపలు, కొమ్ములను వేరుగావేరుగా ఉడకబెట్టాలి. మరీ ఎక్కువ ఉడకబెడితే రంగు చెడిపోతుంది. తక్కువగా ఉడకబెడితే దుంపలు పెళుసుగా మారి మెరుగు పెట్టేటప్పుడు ముక్కలుగా విరిగిపోతాయి. స్టీమ్ బాయిలర్లలో తక్కువ సమయంలో ఎక్కువ పసుపును ఉడికించి, నాణ్యతతో కూడిన పసుపు పొందవచ్చు.