News May 20, 2024
బోథ్‌లో 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు

మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు SI రాము తెలిపారు. బోథ్ మండలం కుచులాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయం వద్ద ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. పట్టుబడిన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News January 22, 2026
ADB: ఆదివాసీ యువతకు డ్రైవింగ్ లైసెన్స్‌లు

ప్రత్యేకంగా ఆదివాసీ యువతకు డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేయాలనే ఉద్దేశంతో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 5 మండలాల యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ మేళా ప్రారంభించారు. ఆదిలాబాద్ ఆర్టీవో కార్యాలయంలో పలువురికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. నార్నూర్, గాదిగూడ, సిరికొండ, బజార్హత్నుర్, భీంపూర్ మండలాల్లోని 400 మంది యువకులకు మొదటి విడతలో భాగంగా లర్నింగ్ లైసెన్స్ అందజేశారు.
News January 22, 2026
ఇంద్రవెల్లి: ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కృషి

గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతులు, ఆర్‌ఓఎఫ్ఆర్ పట్టాల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందని పీవో యువరాజ్ తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యా, వైద్యం, రవాణా సౌకర్యం వంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆదివాసీల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని, తండాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
News January 22, 2026
జిల్లాలో 16,405 ఇండ్లు మంజూరు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 16,405 ఇండ్లు మంజూరు చేశామని, ఇందుకోసం రూ.156 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా నాగోబా దర్బార్‌లో తెలిపారు. పీవీటీజీ కుటుంబాలకు ప్రత్యేకంగా 639 ఇండ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని వివరించారు. ఈ నెల 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో పెందూర్ శాంతాబాయికి ఆహ్వానం లభించిందన్నారు.


