News May 20, 2024
ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిలను నియమించింది. DVKకు మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పార్టీ కార్మిక విభాగం నాయకుడు రాంబాబు యాదవ్ , MLGకు భాస్కర్ రావు, రాజీవ్ సాగర్, మునుగోడుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాకేశ్ కుమార్, సాగర్‌కు నోముల భగత్, NKLకు చిరుమర్తి లింగయ్య, NLGకు కంచర్ల భూపాల్ రెడ్డిలను నియమించింది.
Similar News
News November 17, 2024
నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి
నల్లగొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన మెండే ప్రేమ్ – సునీతల కుమారుడు మెండే ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.
News November 17, 2024
NLG: నెలాఖరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె SLBC కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని తనిఖీ చేశారు. టీజీ ఎస్ఎం ఐడీసీ చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల పరిస్థితిని వివరించారు.
News November 16, 2024
నల్గొండ: చేతికి వచ్చిన వరి పంట.. రైతుళ్లో ఆందోళన
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చింది. ఆనందంగా ఉండాల్సిన అన్నదాతలు భయంభయంగా, ఆందోళన చెందుతున్నారు. మారుతున్న వాతవరణ పరిస్థితులే అందుకు కారణం. ఆరుగాళం కష్టపడి పండించిన పంట ఎక్కడ అందకుండా పోతుందేమో అనేదే వారి ఆందోళన. వర్షాలు రాకూడదని, పంట చేతికందాలని అన్నదాతులు వరుణ దేవుడని ప్రార్థిస్తున్నారు.