News May 20, 2024
NZB: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం

లోక్‌సభ ఎన్నికలు పూర్తవ్వడంతో సర్పంచ్ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1056 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలు NZB- 530 (5300 వార్డులు) ఉండగా.. KMR-526 (4,642 వార్డులు) గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
Similar News
News January 19, 2026
నిజామాబాద్‌లో 13.2°C ఉష్ణోగ్రత

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్‌లో అత్యల్పంగా 13.2°C, సాలూరాలో 13.2, చిన్న మావంది 13.5, ఏర్గట్ల 14.0, మెండోరా 14.1, మంచిప్ప 14.4, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ 14.5, బాల్కొండ, వేంపల్లి 14.6, మదన్ పల్లె 14.7, గోపన్న పల్లి 14.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 19, 2026
నిజామాబాద్: ఈనెల 20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు

నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణుల గణన ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ గణనలో పులులు, చిరుతలు, జింకలు, నెమళ్లు, అడవి పందులు తదితర వన్యప్రాణుల సంఖ్యను లెక్కించనున్నారు. సిరకొండ, కమ్మర్పల్లి, ఇందల్వాయి, వర్ని, ఆర్మూర్, నిజామాబాద్ రేంజ్ పరిధిలో ఈ గణన చేపట్టనున్నారు. గణన ఫలితాల ఆధారంగా అటవీ సంరక్షణ, భద్రత చర్యలు మరింత బలోపేతం చేయనున్నారు.
News January 19, 2026
సాలూర వాసికి పుడమి పుత్ర-రైతు మిత్ర అవార్డు

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న సాలూరకు చెందిన రైతు గంగారాం పుడమిపుత్ర-రైతుమిత్ర జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కేజీ గంగారం సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు దక్కడంపై సాలురా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


