News May 20, 2024

ప్రకాశం: రెండేళ్లల్లో 45 మంది మృతి

image

ఒంగోలు-కర్నూలు రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. చీమకుర్తి, సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే గడిచిన రెండేళ్లలో 120కి పైగా రోడ్డు ప్రమాదాలు, 45 మంది మృత్యువాత పడ్డారు. ఈ రహదారిపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాలు కూడా నడుస్తుంటాయి. ఇప్పటికే ఆ రోడ్డులో 16 బ్లాక్ స్పాట్‌లు గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఆ రోడ్డు అంటే కొంతమందికి భయమే.

Similar News

News October 1, 2024

ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీకి రూ.122.64 కోట్లు మంజూరు

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 2,88,144 మంది లబ్ధిదారులకు రూ.122.64 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అన్సారియా తెలిపారు. 2వ తేదీ గాంధీజయంతి కావడంతో 1న పింఛన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు .ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.

News September 30, 2024

ఒంగోలు: హిజ్రాలు ఆత్మగౌరవంతో బతకాలి: ఎస్పీ

image

హిజ్రాలు ఆత్మగౌరవంతో బతకాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. ఒంగోలులో సోమవారం హిజ్రాలు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిజ్రాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, అణచివేతలు నుంచి గర్వంగా సభ్య సమాజంలో తలెత్తుకొని బ్రతకాలని ఎస్పీ అన్నారు. హిజ్రాలు గ్రూపులుగా విడిపోయి శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం, బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు.

News September 30, 2024

చంద్రబాబు, పవన్ ముక్కు నేలకు రాయాలి: తాటిపర్తి

image

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి హిందువులకు క్షమాపణలు చెప్పాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ‘తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అవమానించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముక్కు నేలకు రాసి హిందువులకు, రాష్ట్ర, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని Xలో పోస్ట్ చేశారు.