News May 20, 2024
ఖమ్మం: ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని విద్యార్థిని సూసైడ్

ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఆదివారం జరిగింది. సీఐ శ్రీహరి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లగాని మేఘన(19) ఇంటర్ చదివింది. హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని మనస్తాపంలో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది.
Similar News
News January 27, 2026
ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు లేవు..!

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ గడువు ఏప్రిల్ వరకు ఉన్నందున, ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగటం లేదు. కేవలం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖమ్మం కార్పొరేషన్‌కు మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడిన మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి 11న పోలింగ్, 13 ఫలితాలు వెల్లడవుతాయి.
News January 27, 2026
ఖమ్మం: ఏకలవ్య గురుకులాల్లో అడ్మిషన్స్ ఓపెన్

ఉమ్మడి జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు RCO అరుణకుమారి తెలిపారు. CBSE సిలబస్‌లో బోధన ఉంటుందన్నారు. భద్రాద్రిలోని ములకలపల్లి, గండుగులపల్లి, గుండాల, చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, టేకులపల్లితో ఖమ్మంలోని సింగరేణి పాఠశాలలో 480 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవాలని, మార్చి 29న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
News January 27, 2026
ఖమ్మం డీఈవో ‘చైతన్య పథం’.. తప్పు చేస్తే ‘డిస్మిస్’..!

ఖమ్మం DEOగా విధుల్లో చేరిన చైతన్య జైని విద్యాశాఖ ప్రక్షాళన దిశగా తీసుకుంటున్న చర్యలు ఉపాధ్యాయుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నర్సింహులగూడెం టీచర్‌ను సర్వీసు నుంచి డిస్మిస్ చేయగా.. విధి నిర్వహణలో రీల్స్ చేస్తూ, ప్రైవేటు సంస్థలను ప్రమోట్ చేస్తున్న మరో టీచర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఒత్తిళ్లకు లొంగకుండా, విద్యాశాఖను సరిదిద్దుతున్న DEOను పలువురు అభినందిస్తున్నారు.


