News May 20, 2024
సిద్ధాంతాలకు కట్టుబడే నేతగా రైసీకి పేరు
ఇరాన్ అగ్రనేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా ఇబ్రహీం రైసీ(63)ని ప్రజలు భావిస్తుంటారు. 2017లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్ రౌహానీ చేతిలో ఆయన ఓడిపోయారు. 2021లో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాలను విడవరనే పేరు ఆయనకు ఉంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన <<13279352>>కన్నుమూయడంతో<<>> ఉపాధ్యక్షుడు మొఖ్బర్ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు.
Similar News
News December 24, 2024
English Learning: Antonyms
✒ Cheap× Dear, unreasonable
✒ Coarse× Fine, Chaste
✒ Classic× Romantic, Unusual
✒ Compact× Loose, Diffuse
✒ Comic× Tragic, tragedian
✒ Conceit× Modesty
✒ Compress× Amplify, Expand
✒ Condemn× Approve, Praise
✒ Concord× Discord
News December 24, 2024
భారత్‌కు పాత్ పిచ్‌లు, ఆసీస్‌కు కొత్తవి.. క్యూరేటర్ ఏమన్నారంటే?
బాక్సింగ్ డే టెస్టుకు IND-AUS సిద్ధమవుతున్న వేళ ఓ వివాదం తెరమీదకు వచ్చింది. MCGలో భారత ప్లేయర్ల ప్రాక్టీస్ కోసం పాత పిచ్‌లు, ఆసీస్ కోసం కొత్త అందుబాటులో ఉంచినట్లు ఫొటోలు వైరలవుతున్నాయి. పాత పిచ్ కారణంగా ప్లేయర్లకు గాయాలైనట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై క్యూరేటర్ స్పందిస్తూ ‘మ్యాచ్‌కు 3 రోజుల ముందే కొత్త పిచ్ సిద్ధమవుతుంది. IND ప్రాక్టీస్ షెడ్యూల్ చాలా ముందుగా వచ్చింది’ అని పేర్కొన్నాడు.
News December 24, 2024
తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం.. 5న టోకెన్ల జారీ
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుపతి భక్తులకు జనవరి 5న టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు దర్శనం కల్పించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 7న దర్శనం కోసం 5వ తేదీన తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనుంది.