News May 20, 2024
రిటైర్మెంట్ విషయం ధోనీ ఎవరికీ చెప్పలేదు: CSK అధికారి

CSK మాజీ కెప్టెన్ ధోనీకి ఇదే ఫైనల్ సీజన్ అని వస్తున్న వార్తలపై ఆ జట్టు అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ధోనీ CSKలో ఎవరికీ చెప్పలేదు. తుది నిర్ణయం తీసుకోవడానికి 2 నెలలు వేచి ఉంటానని ఆయన మేనేజ్‌మెంట్‌కు తెలిపారు’ అని పేర్కొన్నారు. కాగా RCB చేతిలో ఓటమి తర్వాత ధోనీ నేరుగా రాంచీకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News January 12, 2026
కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కోల్ ఇండియా లిమిటెడ్(<
News January 12, 2026
పనసలో కాయకుళ్లు తెగులు లక్షణాలు

పనసలో కాయకుళ్లు తెగులు ప్రధానంగా బూజు తెగులు వల్ల వస్తుంది. ఇది పూత, పిందె దశలో మొదలై కాయకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల తొలుత మగ పువ్వులు, పూత, పిందెలు కుళ్లిపోతాయి. తర్వాత ఎదిగే కాయలు నల్లగా మారి కుళ్లిపోతాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
News January 12, 2026
వచ్చే ఏడాది భారత పర్యటనకు ట్రంప్!

భారత్ తమకు చాలా కీలకమైన భాగస్వామి అని ఇండియాలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ అన్నారు. నిజమైన మిత్రదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయినా.. చివరకు సామరస్యంగా పరిష్కరించుకుంటాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి గొప్ప స్నేహితుడైన ట్రంప్ వచ్చే ఏడాది భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందన్నారు. టారిఫ్‌లు, ట్రేడ్ డీల్ వంటి వివాదాల నేపథ్యంలో గోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.


