News May 20, 2024
నేడు ఎడ్‌సెట్ హాల్ టికెట్లు విడుదల

TG: ఈనెల 23న జరగనున్న ఎడ్‌సెట్ పరీక్ష హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న ఈ పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. ఉ.10 నుంచి మ.12 వరకు మొదటి సెషన్, మ.2 నుంచి సా.4 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.
Similar News
News January 13, 2026
సంక్రాంతి రోజున అస్సలు చేయకూడని పనులివే..

సంక్రాంతి పర్వదినాన స్నానం చేసాకే ఆహారం తీసుకోవాలి. ప్రకృతిని ఆరాధించే పండుగ కాబట్టి చెట్లు, మొక్కలను నరకకూడదు. మద్యం, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలు తీసుకోకూడదు. ఇంటికి వచ్చిన సాధువులు, పేదలను ఖాళీ చేతులతో పంపకూడదు. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. సాయంత్రం వేళ నిద్రించకూడదని పండితులు చెబుతారు. ఈ నియమాలు పాటిస్తే శుభం కలుగుతుందని నమ్మకం.
News January 13, 2026
భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

TG: వేసవిలో బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటి ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఈసారి అది 2.50 లక్షల కేసులకు పెరగొచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు అన్ని బ్రూవరీలకు లక్ష్యాలను నిర్దేశించింది. కాగా ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హరి కిరణ్ బ్రూవరీలను సందర్శించి బీర్, ఇతర మద్యం ఉత్పత్తిపై సూచనలు ఇచ్చారు.
News January 13, 2026
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

<


