News May 20, 2024
కాకినాడ, పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్

AP: కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటింగ్‌కు ముందు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఈసీకి నివేదిక ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట సహా పలు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించింది. ఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా ఉంచాలని నివేదికలో పేర్కొంది. కాగా జూన్ 4న ఫలితాలు వెల్లడవనున్నాయి.
Similar News
News March 7, 2026
మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు: భారత్

రష్యా నుంచి ఆయిల్ కొనడానికి భారత్‌కు 30 రోజులు <<19308509>>అనుమతిస్తున్నట్లు<<>> అమెరికా చేసిన ప్రకటనపై కేంద్రం స్పందించింది. ‘హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు నెలకొన్నందున చౌకగా లభించే ఏ దేశం నుంచైనా ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటాం. దీనికి ఎవరి అనుమతీ అవసరం లేదు. మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. మేం ముడి చమురు వనరుల లభ్యతను 27 నుంచి 40 దేశాలకు విస్తరించాం’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.
News March 7, 2026
650 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఒక్కరోజే ఛాన్స్

RBIలో 650 అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికే రేపే చివరి తేదీ. 50% మార్కులతో డిగ్రీ పాసై, స్థానిక భాషలో ప్రావీణ్యం ఉన్న వారు అర్హులు. వయోపరిమితి 20-28 ఏళ్లు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.29,000-రూ.78,640 చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://rbi.org.in./
News March 7, 2026
అమెరికాకు షాక్.. కీలక వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్!

అమెరికాకు ఇరాన్ షాకిచ్చింది. గల్ఫ్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ సిస్టమ్‌ను దెబ్బతీసింది. <<14350576>>థాడ్(THAAD)<<>>లో ఉపయోగించే రాడార్ పరికరాలను ధ్వంసం చేసింది. జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరంలో ఉన్న ఈ రాడార్ సిస్టమ్‌పై యుద్ధం ప్రారంభంలోనే దాడి జరిగిందని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ సిస్టమ్ విలువ $300M(₹2,760Cr) పైనే. ప్రపంచంలో USకు 8 థాడ్ వ్యవస్థలున్నాయి.


