News May 20, 2024
చట్టపరంగా ఎటువంటి తప్పు చేయలేదు: విష్ణుకుమార్ రాజు

చట్టపరంగా, న్యాయపరంగా తాను ఎటువంటి తప్పు చేయలేదని విశాఖ నార్త్ BJP MLA అభ్యర్థి <<13279687>>విష్ణుకుమార్ రాజు<<>> అన్నారు. నగరంలోని బర్మా కాలనీలో రెండు కుటుంబాల మధ్య దాడికి సంబంధించి కేసును తప్పుదోవ పట్టించారని పోలీసులు ఆయనకు 41-ఏ నోటీసులు అందజేశారు. దీనిపై ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ బెయిలు తెచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 15, 2025
విశాఖ: బస్సుల్లో రద్దీ.. ప్రయాణ సమయాలు మార్చుకోవాలని పిలుపు

స్త్రీ శక్తి పథకంతో జిల్లాలోని బస్సుల్లో రద్దీ పెరిగిందని, RTC ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని RTC విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సూచించారు. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఉదయం 7 నుంచి 10, సా. 4- 7 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికుల రద్దీ ఉంటోందన్నారు. దీంతో ఉ.10 నుంచి, సా.7 తర్వాత ప్రయాణాలు చేసేలా చూసుకోవాలని మహిళలు, ప్రయాణికులను కోరారు.
News September 15, 2025
మధురవాడలో ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.
News September 14, 2025
రుషికొండ బీచ్‌లో ఇద్దరు బాలురు గల్లంతు

రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. పీఎం పాలెం, ఆర్‌హెచ్ కాలనీ ప్రాంతాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయితో పాటు మరో ఇద్దరు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగగా అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని మెరైన్ పోలీసులు, లైఫ్ గాడ్స్ కాపాడారు. సంజయ్, సాయి అచూకీ ఇంకా లభ్యం కాలేదని పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.