News May 20, 2024
SP బిందు మాధవ్‌తో మాకు సంబంధాలు లేవు: శ్రీకృష్ణదేవరాయలు

AP: పల్నాడు జిల్లాలో ఓటింగ్ టీడీపీ కనుసన్నల్లో జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. తాను పోలింగ్ రోజున ఎలాంటి హింసను ప్రేరేపించలేదని స్పష్టం చేశారు. ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌తో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. తనకు పోలీసులెవరూ సాయం చేయలేదని, కాల్ డేటాను సిట్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
రైతులకు బోనస్ డబ్బులు విడుదల

TG: సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది. దీంతో ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.1,429 కోట్ల బోనస్ డబ్బులు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
News January 12, 2026
సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

PM మోదీ కొత్త ఆఫీసు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న అందులోకి ఆయన షిఫ్ట్ కానున్నారు. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ‘సేవా తీర్థ్’ కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో PM ఆఫీస్, క్యాబినెట్ సెక్రటేరియట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ భవనాలు నిర్మించారు. 1947 నుంచి సౌత్ బ్లాక్‌లో PMO కొనసాగుతోంది. తరలింపు తర్వాత సౌత్, నార్త్ బ్లాకులను మ్యూజియాలుగా మారుస్తారు.
News January 12, 2026
ఇతిహాసాలు క్విజ్ – 125 సమాధానం

ఈరోజు ప్రశ్న: భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది?
జవాబు: దుర్యోధనుడు విషమిచ్చి నదిలో పడేయగా, భీముడు నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజు వాసుకి భీముడిని తన మనువడిగా గుర్తించి, దివ్య రసాన్ని ప్రసాదించాడు. ఆ అమృత రసం తాగడం వల్లే భీముడికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఆ బలంతోనే ఆయన ఎందరో బలవంతులను, కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


