News May 20, 2024
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీమ్

మంచు విష్ణు హీరోగా ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ మూవీ టీజర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజవనుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టీజర్‌ను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన భారత్ పెవిలియన్‌కి చేరుకుంది. విష్ణు, ముఖేశ్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పాటు పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు.
Similar News
News November 4, 2025
రబీలో వరికి బదులు ఆరుతడి పంటలతో లాభాలు

రబీ కాలంలో వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం 2 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. పంట మార్పిడి వల్ల పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులు తగ్గుతాయి. నిత్యావసరాలైన పప్పులు, నూనె గింజలు, కూరగాయల కొరత తగ్గుతుంది. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుతుంది.
News November 4, 2025
వరి మాగాణుల్లో పంట ఎంపిక.. ఇవి ముఖ్యం

వరి మాగాణుల్లో పంట ఎంపికకు ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. రైతులు ఎంపిక చేసుకునే ప్రత్యామ్నాయ పంటలకు స్థిరమైన మార్కెట్, మద్దతు ధర ఉండేలా చూసుకోవాలి. కనీస మద్దతు ధర, పంట భీమా, నాణ్యమైన విత్తనాలు సకాలంలో లభించే పంటలను ఎన్నుకోవాలి. వరికి ప్రత్యామ్నాయంగా ఎన్నుకునే పంటలు తక్కువ నీటిని వినియోగించుకొని, దిగుబడిని అందించేవి అయ్యి ఉండాలి.
News November 4, 2025
గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు చాలామంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉన్న గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్తసరఫరా జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టి ఈ స్ట్రోక్ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% దాకా క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రోక్‌లేనని తెలిపారు.


