News May 20, 2024

విశాఖలో కొండెక్కిన చికెన్ ధర

image

వేసవికాలం కావడంతో కోళ్ల పెంపకం తగ్గింది, దీంతో బ్రాయిలర్ కోళ్ల లభ్యత తగ్గడంతో విశాఖలో ధరలు పెరిగాయి. గడచిన రెండు నెలల్లో చికెన్ ధర రూ.230 నుంచి రూ.260 వరకు ఉండేది. సోమవారం దీని ధర రూ.296కు పెరిగింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 20 రోజుల్లో కిలోపై రూ.40 వరకు పెరిగింది. గుడ్లు ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చి నెలలో 100 గుడ్ల ధర రూ.425 ఉండగా నేడు రూ.550గా ఉంది.

Similar News

News November 5, 2025

విశాఖ: అంగన్వాడీ ఉద్యోగాలు.. 2 పోస్టులకు 22మంది

image

ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడి వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరిరోజు కావడంతో ఎక్కువమంది ఒకేసారి చేరుకున్నారు. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

News November 5, 2025

గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

image

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.

News November 5, 2025

ఆరిలోవ రైతు బజార్‌లో స్టాళ్ల కేటాయింపునకు డ్రా

image

ఆరిలోవ రైతు బజార్‌లో ఖాళీగా ఉన్న స్టాళ్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. అక్టోబర్ 22న డ్రా ద్వారా 50 మంది రైతులకు స్టాళ్లు కేటాయించగా.. నేడు డ్వాక్రా సభ్యుల కోసం 10 స్టాళ్లు, వికలాంగుల కోసం ఒక స్టాల్ కేటాయించనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో డ్రా నిర్వహించి తుది కేటాయింపులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు