News May 20, 2024

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 20 మంది పై కేసు

image

నిజామాబాద్‌లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ సీఎస్ఐ చర్చ్ సమీపంలో వాహనాల తనిఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 20 మంది పై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ వెల్లడించారు. సరైన పేపర్లు లేని వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News January 25, 2026

బోధన్: సుదర్శన్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత

image

బోధన్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. గత ప్రభుత్వ నిధులతోనే ఈ పనులు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిధులు కేటాయించలేదని నిరసన చేపట్టారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యాదవ్, మాజీ కౌన్సిలర్ గంగాధర్‌లను అరెస్ట్ చేశారు. దీంతో పట్టణంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

News January 25, 2026

NZB: కానిస్టేబుల్ సౌమ్య హైదరాబాద్ తరలింపు

image

నిజామాబాద్ మాధవ్ నగర్‌‌లో స్మగ్లర్ల కారుతో ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలు పాలైన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను హైదరాబాద్‌కు తరలించారు. సౌమ్యపై నుంచి కారు వెళ్లడంతో కడుపు భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వైద్యుల సూచనల మేరకు, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు.

News January 25, 2026

సాలూరలో 13.1°C ఉష్ణోగ్రత నమోదు

image

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అధికారులు వెల్లడించారు. సాలూరా 13.1°C, చిన్న మావంది 13.4, నిజామాబాద్ 14.1, గన్నారం, మంచిప్ప 14.2, జకోరా, బాల్కొండ 14.4, డిచ్‌పల్లి 14.5, వేంపల్లి, కల్దుర్కి, మెండోరా, మదన్ పల్లి 14.7, చీమన్‌పల్లి, కోరాట్ పల్లి, ఆలూర్, బెల్లాల్ 14.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.