News May 20, 2024

తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్ ప్రమాణం

image

తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్ తే బాధ్యతలు స్వీకరించారు. జనవరిలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. మాజీ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ హయాంలో ఈయన గత నాలుగేళ్లు ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా లై చింగ్ చైనాపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పరిరక్షణలో తైవాన్ వెనకడుగు వేయదని.. చైనా తన బెదిరింపులను మానుకోవాలన్నారు.

Similar News

News December 27, 2024

PHOTO: పాకిస్థాన్‌లో మన్మోహన్ సింగ్ ఇల్లు

image

మన్మోహన్ తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. 1932లో ఇప్పటి పాకిస్థాన్‌లోని గాహ్ అనే మారుమూల గ్రామంలో జన్మించి, స్కూల్ విద్యను అక్కడే అభ్యసించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ఇండియాకు వలస వచ్చింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో నానమ్మ వద్ద పెరిగారు. 1991, 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని మన్మోహన్ తన పనితీరుతో గట్టెక్కించారు. పై ఫొటోలో PAKలోని మన్మోహన్ ఇల్లు, స్కూలు చూడొచ్చు.

News December 27, 2024

భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా

image

AP: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1 నుంచి 10-20శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో అమలును వాయిదా వేసింది. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న మంగళగిరిలో సీసీఎల్ఏ కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

News December 27, 2024

డైరెక్టర్ కన్నుమూత

image

తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అలియాజ్ SD సభా(61) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన తమిళంలో విజయ్‌కాంత్ హీరోగా భారతన్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగులో 2005లో జగపతిబాబు, కళ్యాణి జంటగా పందెం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సభా తమిళంలో తీసిన సుందర పురుషుడు అనే సినిమా ‘అందాల రాముడు’గా రీమేక్ చేశారు. మొత్తంగా 10 మూవీలకు పనిచేశారు.