News May 20, 2024
సెల్‌ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడితే హైబీపీ

మనిషి జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌తో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఫోన్‌లో వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే హైబీపీ సమస్య 12 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. 6 గంటలకుపైగా మాట్లాడితే 25 శాతం సమస్య ఉంటుందని తేల్చారు. మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు, తీవ్ర తలనొప్పి, చెవి సమస్యలూ వస్తాయట. ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీనే దీనికి కారణమని చెప్పారు.
Similar News
News February 9, 2026
500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద ఇళ్లలో ఒకటిగా పేరొందిన లక్ష్మీవిలాస్ ప్యాలెస్ వడోదరాలో (GJ) ఉంది. 19వ శతాబ్దం చివరలో గైక్వాడ్ రాజకుటుంబం కోసం బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ చిసోమ్ దీనిని డిజైన్ చేశారు. 500 ఎకరాలకు పైగా ఉండే ఈ ప్యాలెస్‌లో మ్యూజియంలు, గార్డెన్లు, రవి వర్మ పెయింటింగ్స్, గోల్ఫ్ క్లబ్ ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ రాజకుటుంబీకులు నివసిస్తున్నప్పటికీ పబ్లిక్ దీనిని చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
News February 9, 2026
మిడ్‌నైట్ క్రేవింగ్స్‌కి కారణం ఇదే..

కడుపునిండా తిన్నా కూడా కొందరికి అర్ధరాత్రి ఆకలివేస్తూ ఉంటుంది. పడుకోలేక దొరికిన స్నాక్స్ తినేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. గ్రెలిన్ హార్మోన్ పెరగడం, ఒత్తిడి, డైటింగ్, కొన్నిరకాల మందులు వాడటం వల్ల క్రేవింగ్స్ వస్తాయి. డిన్నర్‌లో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే క్రేవింగ్స్ తగ్గుతాయి. లేదంటే డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
News February 9, 2026
ఎప్‌స్టీన్ మరణశాసనం.. ఒక రోజు ముందే రాసేశారా?

US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్ 2019 AUG 10న మాన్‌హట్టన్ జైల్లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే అతడి మరణ ప్రకటన AUG 9వ తేదీనే రూపొందించినట్టు తాజాగా విడుదలైన ఫైల్స్ చూపిస్తున్నాయి. అది ఆత్మహత్య అని అధికారులు చెప్పినా తేదీలో వ్యత్యాసం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనితో పాటు 9వ తేదీ రాత్రి CCTV దృశ్యాలు, చనిపోయాక తీసిన ఫొటోల్లో అతడి ఫస్ట్ నేమ్ తప్పుగా ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి.


