News May 20, 2024
తిరుపతి జిల్లాలో రీపోలింగ్ లేదు: కలెక్టర్

కౌంటింగ్ ఏర్పాట్లు జూన్ 1వ తేదీ కల్లా పూర్తి చేస్తామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. కలెక్టరేట్‌లో వారు మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల తర్వాతే EVMలు లెక్కిస్తామని.. జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ ఉండదని స్పష్టం చేశారు. చంద్రగిరిలో 4 చోట్ల రీపోలింగ్ జరిపించాలని చెవిరెడ్డి కోరిన విషయం తెలిసిందే.
Similar News
News November 5, 2025
గిరిజనులకు కొత్త గ్యాస్ కనెక్షన్లు: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని 411 మంది గిరిజనులకు నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీపం-2 పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీ కాలనీలలో ప్రతి ఇంటిని సందర్శించి అర్హతలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
News November 4, 2025
సోమల: ముళ్ల పొదలలో నవజాత శిశువు

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ముళ్ల పోదలలో గుర్తు తెలియని వ్యక్తులు పడవేసిన ఘటన సోమల మండలంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ నడింపల్లి సమీపంలో శిశువును గుర్తించిన స్థానికులు సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స ఇచ్చిన తరువాత ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు చిన్నారిని అంబులెన్స్‌లో చిత్తూరు శిశు విహార్‌కు తరలించారు.
News November 4, 2025
చిత్తూరు: ఆలస్యంగా వస్తున్న టీచర్లు..!

చిత్తూరు జిల్లాలో సుమారు 100 మంది ప్రభుత్వ టీచర్లు స్కూళ్లకు ఆలస్యంగా వస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు సైతం గుర్తించారు. టీచర్లు ఆలస్యంగా రావడంపై వివరణ కోరామని DEO వరలక్ష్మి చెప్పారు. ఆలస్యానికి గల కారణాలు చెప్పాలని ఆదేశించారు. టీచర్లు సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం చేయకూడదని స్పష్టం చేశారు.


