News May 20, 2024
MBNR: సీఎం సొంత జిల్లాలో పంతం నెగ్గేనా .. !

ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఈసారి ఉమ్మడి జిల్లా పార్లమెంట్ స్థానాలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ ఫోకస్ పెట్టాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 14కు 12 MLAలను కాంగ్రెస్ గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందా.. సీఎం పంతం నెగ్గేనా..? అని జిల్లాలో చర్చ జోరందుకుంది.
Similar News
News September 15, 2025
MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్‌టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
News September 15, 2025
MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.
News September 14, 2025
GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.