News May 20, 2024

తిరుపతి DSPగా రవి మనోహరాచారి

image

తిరుపతి, చంద్రగిరిలో హింస చెలరేగడంతో పలువురు పోలీసులపై ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తవారిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి డీఎస్పీగా రవిమనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ సీఐగా విశ్వనాథ్ చౌదరి, అలిపిరి సీఐగా రామారావును నియమించింది. రవి మనోహరాచారి ఆధ్వర్యంలోనే తిరుపతి గొడవలపై సిట్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Similar News

News November 4, 2025

చిత్తూరు: ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి

image

ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వైద్యశాల నూతన భవనాన్ని చిత్తూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బందికి ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు.

News November 3, 2025

చిత్తూరు: 90% వైకల్యం ఉన్నా ‘నో పింఛన్’

image

ఐరాల (M) నెల్లిమందపల్లికి చెందిన నీరిగట్టి గౌతమ్ కుమార్ సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్‌ను వికలాంగ పింఛను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ధ్రువీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉన్నా.. ఇదివరకు పెన్షన్ మంజూరు కాలేదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, పరిశీలించి పింఛను మంజూరు చేయాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.

News November 3, 2025

అడవి పందుల కోసం వేట.. ఇద్దరి మృతి

image

బంగారుపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బండ్లదొడ్డి గ్రామపంచాయతీలో వన్య ప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఒక అడవి పంది కూడా చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.