News May 20, 2024
IPL-2024: నాకౌట్ మ్యాచ్‌ల స్పెషల్ పోస్టర్

IPL టోర్నీలో లీగ్ దశ ముగియడంతో రసవత్తరంగా సాగే నాకౌట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. రేపు క్వాలిఫయర్-1 జరగనుంది. ఈనెల 22న ఎలిమినేటర్, 24న క్వాలిఫయర్-2 జరగనుండగా.. మే 26న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను IPL తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. మరి ఫైనల్‌కు చేరి గెలిచే జట్టేదో కామెంట్ చేయండి.
Similar News
News December 10, 2025
ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ

భారత పర్యటనలో మెస్సీ పలు ప్రాంతాలను చుట్టేయనున్నారు. ఈ నెల 13న కోల్‌కతాలో అడుగుపెట్టనున్న ఆయన సాయంత్రం HYD వస్తారు. 14న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తారు. 15వ తేదీ ఢిల్లీ చేరుకొని PM మోదీతో భేటీ అవుతారు. కాగా తొలిరోజు కోల్‌కతాలో తన అతిపెద్ద(70 అడుగుల) విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించాల్సి ఉన్నా సెక్యూరిటీ కారణాలతో ఆ ప్రోగ్రామ్‌ను వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు.
News December 10, 2025
దిగుబడి పెంచే నానో ఎరువులను ఎలా వాడాలి?

దశాబ్దాలుగా సాగులో ఘన రూపంలో యూరియా, DAPలను రైతులు వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూప నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటి వాడకం వల్ల ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90% గ్రహించి, దిగుబడి పెరిగి.. పెట్టుబడి, గాలి, నేల కాలుష్యం తగ్గుతుందంటున్నారు నిపుణులు. నానో ఎరువులను ఎలా, ఎప్పుడు, ఏ పంటలకు వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 10, 2025
వణికిస్తున్న చలి.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే 3-4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 °C తక్కువగా నమోదవుతాయని HYD IMD తెలిపింది. ఇవాళ, రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, NML, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత అత్యల్పంగా ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 6.1°C నమోదైంది. 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది.


