News May 20, 2024
NZB: తాళం వేసిన ఇంట్లో దొంగల చేతివాటం

నగరంలో తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. షాద్ నగర్‌లో నివాసం ఉండే మహమ్మద్ అబ్దుల్ సలాం కుటుంబం ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళారు. తిరిగి అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూడగా తాళం ధ్వంసం చేసి కనిపించింది. ఆరోటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Similar News
News January 13, 2026
బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

NZB జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో శుభాలు సమకూరాలని, అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.