News May 20, 2024

తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం

image

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. మేడిగడ్డ, ధాన్యం కొనుగోళ్లు, విద్యాసంస్థల్లో వసతులు తదితర అత్యవసర అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యా రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని వంటి అంశాలపై చర్చించొద్దని ఇప్పటికే ఈసీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News December 24, 2024

నేడు కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు

image

అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది. ఢిల్లీలో జరిగే నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో ఆందోళనలు జరగనున్నాయి.

News December 24, 2024

తెలంగాణలో ఏం జరుగుతోంది?: కేటీఆర్

image

TG: తెలంగాణలో ఏం జరుగుతోందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్‌లు, స్టంట్‌లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్ట్‌లు. ఇవేనా? ఇంకేమైనా ఉంటే చెప్పండి’ అని పేర్కొన్నారు.

News December 24, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల టైమ్

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 28 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న మలయప్పస్వామిని 65,656 మంది దర్శించుకోగా, 24,360 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది. అటు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.