News May 20, 2024

మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ యామీగౌతమ్

image

హీరోయిన్ యామీగౌతమ్ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త ఆదిత్యధర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాబుకు ‘వేదవిద్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. దీంతో ఆమెకు నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. యామీ-ఆదిత్య 2021లో పెళ్లి చేసుకున్నారు. తెలుగులో గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ చిత్రాల్లో ఆమె నటించారు. ఇటీవల విడుదలైన ‘ఆర్టికల్ 370’ సినిమాలోనూ యామీ కీలక పాత్ర పోషించారు.

Similar News

News February 11, 2026

స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి

image

కెనడాలోని స్కూల్లో దుండగుడి కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సెకండరీ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దుండగుడు చనిపోయాడని లోకల్ మీడియా తెలిపింది. కాల్పులు ఎవరు, ఎందుకు జరిపారు, బాధితులంతా విద్యార్థులేనా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

News February 11, 2026

భారత్‌లో తగ్గిన అవినీతి

image

ఇండియాలో అవినీతి తగ్గినట్లు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. కరప్షన్ ఇండెక్స్‌లో 2024లో 182 దేశాల్లోకెల్లా 96వ స్థానంలో ఉన్న భారత్ 2025 నాటికి 91వ స్థానానికి ఎగబాకింది. డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్‌.. అతితక్కువ అవినీతి ఉన్న దేశాలుగా నిలిచాయి. దక్షిణ సూడాన్, సోమాలియా అత్యంత అవినీతిమయ దేశాలుగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత USలో అవినీతి పెరిగినట్లు తేలింది.

News February 11, 2026

ఆస్పత్రిలో అభిషేక్ శర్మ.. మ్యాచుకు కష్టమే!

image

డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఢిల్లీలో గౌతమ్ గంభీర్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లిన అభి.. నొప్పితో కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. నిన్న ఆస్పత్రిలో చేరగా, నేడూ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో రేపు నమీబియాతో జరిగే మ్యాచులో ఆడటం అనుమానమేనని సమాచారం. ఫిట్‌నెస్ ఆధారంగా FEB 15 పాక్‌తో మ్యాచ్ ఆడటంపై నిర్ణయం తీసుకోనున్నారు.