News May 20, 2024
Get Ready: కాసేపట్లో IPL టికెట్లు విడుదల
ఐపీఎల్ సీజన్-17 ఫైనల్ మ్యాచ్ టికెట్లు కాసేపట్లో అందుబాటులోకి రానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌లో వీటిని విక్రయించనున్నారు. రూపే కార్డ్ ఉన్న వారు మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. టికెట్ కనిష్ఠ ధర రూ.3 వేలుగా ఉంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 26న ఫైనల్ జరగనుంది.
Similar News
News December 24, 2024
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. గ్రూప్ దశలో భారత్ మొత్తం 3 మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. మార్చి 4న సెమీఫైనల్-1, 5న సెమీఫైనల్-2, 9న ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. భారత్ ఫైనల్‌కు చేరితే ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది. లేదంటే లాహోర్‌లో నిర్వహిస్తారు.
News December 24, 2024
2024లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు
☛ ఐరా ఖాన్-నుపుర్ శిఖరే (JAN 3)
☛ తాప్సి-మథియాస్ బో (MARCH 23)
☛ సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ (JUNE 23)
☛ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ (JULY 12)
☛ సిద్ధార్థ్-అదితి రావు హైదరీ (SEP 16)
☛ అక్కినేని నాగచైతన్య-శోభిత (DEC 4)
☛ కీర్తి సురేశ్-ఆంటోనీ (DEC 12)
☛ పీవీ సింధు-వెంకట్ దత్తా (DEC 22)
News December 24, 2024
సీఎం రేవంత్ దావోస్ పర్యటన
TG: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అక్కడ జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ టూర్‌కు వెళ్తారు.