News May 20, 2024

తెలంగాణలోనే GHMC టాప్.. తగ్గేదేలే!

image

రాష్ట్రంలో TS-bPASS అమలులోకి వచ్చిన NOV 2020 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన భవన నిర్మాణాల్లో GHMC టాప్ ప్లేస్‌లో నిలిచింది. GHMC పరిధిలో 36,057 భవనాలకు అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బడంగ్‌పేట్ కార్పొరేషన్ 9,241 నిర్మాణాలతో సెకెండ్ ప్లేస్‌లో ఉంది. తుర్కయంజాల్‌లో 5,526, బోడుప్పల్‌లో 5,419 నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. భవన నిర్మాణ రంగంలో జీహెచ్ఎంసీ దూసుకెళ్తుందని పేర్కొంది.

Similar News

News October 3, 2024

HYD: పోలీసుల సూచనలు.. ఇలా చేస్తే SAFE!

image

✓క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్, కంప్యూటర్, మొబైల్ లాంటి వాటి పాస్వర్డ్ తరచుగా మార్చుకోవాలి
✓పాస్వర్డ్ పెట్టేముందు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండేలా చూసుకోవాలి
✓పాస్వర్డ్ వివరాలను ఎంత దగ్గర వారికైనా చెప్పొద్దు
✓ఫేక్ మెసేజ్ లింకులు, మెయిల్స్, కాల్స్ పై స్పందించకండి.
✓సైబర్ నేరంగా గుర్తిస్తే 1930కు కాల్ చేయండి
•పై సూచనలు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చేశారు.

News October 3, 2024

HYD: గుడ్డిగా నమ్మితే నట్టేట మునుగుతారు.. జాగ్రత్త!

image

‘కర్ణుడి చావుకు సవాలక్ష’ కారణాలు అన్నట్టు HYDలో సైబర్ నేరాలతో రూ.కోట్లు మోసపోతున్న పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక వడ్డీతో ఆశ చూపటం, ట్రేడింగ్, కస్టమర్ కాల్ సెంటర్, హెల్ప్ లైన్ పేరిట, హై ప్యాకేజీ జాబ్, OTP మోసాలు, ఫేక్ లింకులు, ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, ఉచిత విదేశీ ప్రయాణాలు, మ్యాట్రిమోనీ పేరిట మాయ మాటలు చెప్పి నట్టేట ముంచి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జర జాగ్రత్త!

News October 3, 2024

HYD: తోపుడు బండి, ఫుడ్ కోర్టు పెట్టారా..?మీకోసమే

image

✓తోపుడు బండ్ల నిర్వాహకులు చేతికి గ్లౌజులు, నెత్తిన టోపీ ధరించాలి
✓దుమ్ము అధికంగా ఉన్నచోట, మురుగు కాలువల పక్కన ఆహారం విక్రయించవద్దు
✓ఆహార పదార్థాలపై మూతలు తప్పనిసరి
✓ కవర్లలోకి గాలిని నోటితో ఊదవద్దు
✓ కూరగాయలు, ఉల్లిగడ్డలు ముందు రోజు కోసి నిల్వ ఉంచొద్దు
✓శుద్ధి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి
•HYD తార్నాక NIN ఈమేరకు సూచనలు చేసింది.