News May 20, 2024
ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్దామ్ జిల్లాలో ఉన్న కవర్ధాలో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 24, 2024
భారత్‌కు ఓ గుడ్‌న్యూస్.. మరో బ్యాడ్‌న్యూస్
ప్రాక్టీస్‌లో గాయపడిన భారత కెప్టెన్ రోహిత్ కోలుకున్నారు. తాను మోకాలి గాయం నుంచి కోలుకొని 4వ టెస్టుకు రెడీగా ఉన్నట్లు రోహిత్ స్పష్టం చేశారు. అటు ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ కూడా గాయం నుంచి కోలుకొని ఫిట్‌గా ఉన్నట్లు ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. రోహిత్ కోలుకోవడం ఇండియాకు గుడ్‌న్యూస్ కాగా మనకు తలనొప్పిగా మారిన హెడ్ కూడా బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులోకి రావడం ఒక రకంగా బ్యాడ్‌న్యూసే.
News December 24, 2024
నేడు కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు
అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది. ఢిల్లీలో జరిగే నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో ఆందోళనలు జరగనున్నాయి.
News December 24, 2024
తెలంగాణలో ఏం జరుగుతోంది?: కేటీఆర్
TG: తెలంగాణలో ఏం జరుగుతోందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టంట్లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్ట్‌లు. ఇవేనా? ఇంకేమైనా ఉంటే చెప్పండి’ అని పేర్కొన్నారు.