News May 20, 2024
ఏపీ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందించిన SIT
AP: ఎన్నికల రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం నివేదిక రూపొందించి.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందజేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిలాల్లో మొత్తం 33 చోట్ల అల్లర్లు జరిగినట్లు అందులో పేర్కొంది.
1370 మందిపై FIR నమోదు చేయగా.. 124 మందిని అరెస్ట్ చేశామని, 94 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీ.. కాసేపట్లో సీఈవో, సీఈసీకి పంపనున్నారు.
Similar News
News December 24, 2024
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వర్షాలు
AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శుక్రవారం వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. 25, 26, 27 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల.. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయని వివరించింది. కోస్తా తీరంలో 35-55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
News December 24, 2024
ఏపీలో BPCL పెట్రోకెమికల్ కాంప్లెక్స్: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
ఆంధ్రప్రదేశ్ తూర్పుతీరం వెంబడి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ హామీ ఇచ్చిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. దీనికోసం తొలుత రూ.6100 కోట్లను పెట్టుబడిగా పెట్టనుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం క్రమంగా పుంజుకుంటోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీని ఎంచుకున్నందుకు బీపీసీఎల్‌కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
News December 24, 2024
యువరాజ్ బయోపిక్.. ఆ హీరో నటిస్తారా?
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్‌ను నిర్మిస్తామని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభగ్ చందక్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది నటిస్తారని సమాచారం. తన అభిమానులతో చిట్‌చాట్ సందర్భంగా యువీ బయోపిక్‌లో నటించాలనుందని ఆయన తెలిపారు. దీంతో ఈ చిత్రంలో ఆయన నటిస్తారని టాక్. కాగా తన పాత్రలో సిద్ధార్థ్ అయితే బాగుంటుందని యువీ కూడా గతంలో చెప్పారు.