News May 20, 2024

రేవ్ పార్టీ నిందితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరణ

image

బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 71 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. మహిళల్లో నటి హేమతో పాటు పలువురు మోడల్స్, టెకీలు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారందరినీ పీఎస్‌కు తరలించిన పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించగా.. మిగతావారి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయనున్నారు.

Similar News

News October 30, 2025

అది వారి ‘రేటు జాబితా’.. ప్రతిపక్షాల మ్యానిఫెస్టోపై మోదీ సెటైర్లు

image

బిహార్‌లో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ‘జంగిల్ రాజ్ నాయకులు ప్రజలను నిరంతరం మోసం చేస్తున్నారు. మ్యానిఫెస్టో పేరుతో ఆర్జేడీ, కాంగ్రెస్ తమ రేటు జాబితాను రివీల్ చేశాయి. వారి ప్రతి డిక్లరేషన్ వెనుక ప్రధాన ఉద్దేశం అవినీతి, దోపిడీ’ అని ఆరోపించారు. బిహార్‌ను RJD, కాంగ్రెస్ డెవలప్ చేయలేవని, గతంలో తమ పాలనలో ప్రజలను మోసం చేశాయని అన్నారు.

News October 30, 2025

ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

image

థైరాయిడ్ పనితీరుకు, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ ఎంతో ముఖ్యం. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధి ఉండదు. అలాగే గర్భస్రావం, వికలాంగ శిశువు, మరుగుజ్జు, చెవి, కంటి సమస్యలు, నత్తి వంటివి వస్తాయంటున్నారు నిపుణులు. పాలు, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News October 30, 2025

శరీరానికి ఎంత అయోడిన్ అవసరమంటే

image

శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అయోడిన్ ఉంటే సరిపోతుంది. రోజుకు కేవలం 150mg తీసుకుంటే చాలు. పిల్లలకు 50mg, గర్భిణులకు 200mg అయోడిన్ సరిపోతుంది. ఒక వ్యక్తి జీవితకాలంలో కేవలం అర టీస్పూన్ అయోడిన్ మాత్రమే అవసరమవుతుంది. మన శరీరంలో 25mg అయోడిన్ ఉంటుంది. కాబట్టి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాన్ని శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అలాగని అతిగా తీసుకున్నా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.