News May 20, 2024

కృష్ణా: ‘ప్రతి 15 రోజులకు శాఖల వారీ సమీక్షలు’

image

జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలయ్యే కార్యక్రమాలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు గతంలో మాదిరిగా అవసరమైన ఎరువులు విత్తనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 5, 2026

పాత సామాన్ల కొట్టులా మచిలీపట్నం GGH

image

మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి (GGH) అధికారుల నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారిందనే ఆరోపణలొస్తున్నాయి. చిన్నపాటి మరమ్మతులు ఉన్న బెడ్లు, పాత ఇనుప సామాన్లను పక్కకు తొలగించకుండా ఓపీ నుంచి సర్జికల్ వార్డులకు వెళ్లే ప్రధాన మార్గంలోనే కుప్పగా వదిలేశారు. దీంతో రోగులు, వారి బంధువులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News March 5, 2026

కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా

image

కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఎమ్మెల్యేలకి నెలకు రూ.15-20 లక్షలు ముట్టజెప్పి వ్యాపారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి 300 టన్నులకు పైగా పేదల బియ్యం నల్ల బజార్‌కి వెళ్తున్నాయి. స్థానిక మిల్లులోనే పాలిష్ పట్టి సాధారణ బియ్యంలా కాకినాడ పోర్టుకి తరలిస్తున్నట్లు సమాచారం. MTM, పామర్రు,పెనమలూరు కేంద్రాలుగా రేషన్ మాఫియా రెచ్చిపోతున్నా.. అధికారుల దాడులు మమ అనిపించేలా ఉంటున్నాయి.

News March 5, 2026

కృష్ణా: అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలు

image

మే 1వ తేదీ నుంచి చేపట్టనున్న ఇళ్ల గణన కార్యక్రమంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కృష్ణా యూనివర్శిటీలో నిర్వహించిన మొదటి దశ ఇళ్ల జాబితా, జిల్లా స్థాయి అధికారుల శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఎన్నికల మాదిరిగా ఈ గణన కార్యక్రమాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి శ్రద్ధతో చేయాలన్నారు.