News May 20, 2024

నెల్లూరులో హై అలెర్ట్..!

image

ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, త్వరలో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో నెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులోకి తెస్తున్నారు. ఇప్పటికే పలు డివిజన్లలో అధికారులు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా నెల్లూరు సిటీలోనూ అమలులో ఉందని DSP శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Similar News

News September 16, 2025

ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేనా…?

image

నెల్లూరు జిల్లాలో ఎడగారుగా 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కోతలు కోసే సమయానికి వర్షాలు పడడంతో పలుచోట్ల పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News September 16, 2025

నెల్లూరు: జాడ తెలియని బై జ్యూస్ ట్యాబ్‌లు

image

2022-23, 2023-24లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు (20,830) ఉపాధ్యాయులకు (3,554) గత YCP ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చింది. బైజూస్‌తో ఒప్పందం కుదుర్చి కొంతమంది సబ్జెక్టులు అప్లోడ్ చేశారు. పాఠ్యాంశాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో డిజిటల్ బోధన ప్రభావం చూపలేదు. కొన్నాళ్లకే ట్యాబ్‌లు పనిచేయక విద్యార్థులు పక్కన పెట్టారు. కొందరు గేమ్స్, వినోదం కోసం వాడేశారు. ప్రస్తుతం ఆ ట్యాబ్‌లు ఎక్కడున్నాయో స్పష్టత లేదు.

News September 16, 2025

నెల్లూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు!

image

జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు మొదలైపోయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర పుట్టి రూ.20,187 ఉండగా మిల్లర్లు రూ.13–15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పంటను దెబ్బతీయగా ధరలు పడిపోతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో పుట్టి రూ.24 వేలు ఉండగా, ఇప్పుడు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.