News May 20, 2024

స్కూళ్ల ఆధునీకరణకు రూ.600 కోట్లు: మంత్రి

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఆధునీకరించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందుకు రూ.600 కోట్లను కేటాయిస్తామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలపై తన అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేసినట్లు మంత్రి చెప్పారు.

Similar News

News November 8, 2025

బిహార్ ఎన్నికల్లో మంత్రి లోకేశ్ ప్రచారం

image

AP: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మంత్రి లోకేశ్ 2 రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని ఇవాళ మధ్యాహ్నం ఆయన పట్నా వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం బిహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలను వారికి వివరిస్తారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రేపు ఉదయం ప్రచారం చేస్తారు.

News November 8, 2025

ప్రభుత్వ స్కూళ్లలో UKG.. 9,800 మందికి ఉద్యోగాలు!

image

TG: రాబోయే విద్యాసంవత్సరం 2026-27 నుంచి మరో 4,900 ప్రభుత్వ పాఠశాలల్లో యూకేజీ తరగతులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి స్కూళ్లలో ప్రారంభించింది. ఒక్కో స్కూల్లో టీచర్ (ఇన్‌స్ట్రక్టర్), ఆయాను నియమిస్తారు. అంటే 9,800 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దశల వారీగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

News November 8, 2025

స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

image

20ల్లోకి అడుగుపెట్టగానే చర్మతీరుకి తగిన స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్‌ క్లెన్సర్‌, టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వాడాలి. వారానికోసారి స్క్రబ్‌, ఆరెంజ్‌ పీల్స్‌ అప్లై చేయాలి. హైలురోనిక్‌ యాసిడ్‌, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వీటితోపాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవాలి.