News May 20, 2024

పాచిపెంట : మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాచిపెంట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై పి నారాయణరావు తెలిపిన ప్రకారం.. పాంచాలి గ్రామానికి చెందిన కలువలపల్లి రాంబాబు(45) మద్యానికి బానిపై అయ్యాడు. అతిగా మద్యం తాగవద్దని భార్య మందలించింది. మనస్తాపం చెందిన రాంబాబు ఈ నెల 18న గడ్డి మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

Similar News

News November 5, 2025

విజయనగరంలో 7న మెగా జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో ఈనెల 7న ఉదయం 9 గంటలకు విజయనగరం AGL డిగ్రీ కాలేజీ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత కుమార్ తెలిపారు. 18-35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చని అన్నారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించాలన్నారు.
12 కంపెనీలు నియామకాలు చేపడతాయని, naipunyam.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

News November 5, 2025

పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలి: VZM SP

image

పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ దామోదర్ కోరారు. విజయనగరం ఎస్పీ కార్యాలయం నుంచి బుధవారం రీసెప్షనిస్టలుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ సమస్యలపై స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్నారు. ఫిర్యాదు రాయడం రానివారికి సిబ్బందే సాయం చేయాలని ఆదేశించారు.

News November 5, 2025

పోష‌కాహారాన్ని స‌కాలంలో అందించాలి: VZM JC

image

జిల్లాలోని 2,499 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సకాలంలో అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎస్‌.సేథుమాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. సరుకుల సరఫరాలో జాప్యం లేకుండా, నాణ్యమైన బియ్యం, పప్పు, నూనె అందించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ డైరెక్టర్ విమల రాణి, సివిల్ సప్లయిస్ డీఎం శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.