News May 20, 2024
నెల్లూరు: 21నే జిల్లాకు రానున్న గవర్నర్

గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పాత షెడ్యూల్ ప్రకారం ఆయన 22న జిల్లాకు రానుండగా.. తాజా షెడ్యూల్ ప్రకాం 21వ తేదీ సాయంత్రం 5.10 నిమిషాలకు గుంటూరు నుంచి రైలులో బయలుదేరి రాత్రి 9.24 నిమిషాలకు నెల్లూరుకు చేరుకోనున్నారు. 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు.
Similar News
News November 3, 2025
నెల్లూరు జైలుకు జోగి రమేష్ తరలింపు

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వారిని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఓ పక్క జోగి రమేష్ అరెస్టు అన్యాయమని, అక్రమమని వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారు.
News November 3, 2025
ఒకే రోజు ఐదుగురు గల్లంతు.. నలుగురి మృతి

జిల్లాలో ఆదివారం విషాదం నెలకొంది. ఇందుకూరుపేట(M) మైపాడు బీచ్లో ముగ్గురు <<18178820>>ఇంటర్ విద్యార్థులు<<>> మృతి చెందగా, <<18180051>>కావలి(M) <<>>తుమ్మలపెంటలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవలో నుంచి కిందపడి మరొకరు మృతి చెందారు. మరోవైపు ఆత్మకూరు పట్టణ సమీపంలోని చెరువులో సాయంత్రం నలిశెట్టి <<18180051>>మహేష్<<>> గల్లంతయ్యాడు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు.
News November 3, 2025
నెల్లూరు: 1,282.63 హెక్టార్లలో పంటకు నష్టం

తుపాన్ కారణంగా జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 33 శాతం కంటే ఎక్కువగా నష్టం జరిగిన పంట వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 79,333 హెక్టార్లలో వరి సాగు చెయ్యగా 1282.63 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వేరుసెనగ 11.4 హెక్టార్లు, మొక్క జొన్న 21.7 హెక్టార్లు, సజ్జ పంటకు 5 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.


