News May 20, 2024
పాలమూరు బిడ్డకు గోల్డ్ మెడల్.. అభినందించిన డీకే అరుణ

ఊట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామానికి చెందిన గణేశ్ ఫిట్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సోమవారం గణేశ్‌ను ఓ ప్రకటనలో అభినందించారు. పరుగు పందెంలో ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
Similar News
News February 4, 2026
మహబూబ్‌నగర్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులపై అవగాహన సదస్సు

మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ కళాభవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రచార ఖర్చుల వివరాల నమోదుపై కీలక సూచనలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
News February 4, 2026
పాలమూరు బరిలో స్వతంత్రుల జోరు!

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 60 డివిజన్లకు గాను మొత్తం 347 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఏకంగా 127 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉండటం విశేషం. పార్టీల వారీగా కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 58, బీజేపీ 52 స్థానాల్లో పోటీలో ఉండగా.. ఎంఐఎం, జనసేన, బీఎస్పీ కూడా బరిలో ఉన్నాయి. స్వతంత్రుల పోటీ పెరగడంతో ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది.