News May 20, 2024
ఏషియన్ రిలే ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు గోల్డ్
TG: ఏషియన్ రిలే ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ సత్తా చాటింది. 4*400 మిక్స్డ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే కొద్ది తేడాలో పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌కు అర్హత సాధించలేకపోయింది. ముహమ్మద్ అజ్మల్, జ్యోతిక, అమోజ్ జాకబ్, సుభ వెంకటేశన్ బృందం 3 నిమిషాల 14.12 సెకండ్లలో రేసును పూర్తి చేయడం గమనార్హం. ఈ విభాగంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక, వియత్నాం నిలిచాయి.
Similar News
News December 25, 2024
ఈ నంబర్లతో ఫోన్ కాల్ వస్తే జాగ్రత్త
గుర్తు తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కేంద్రం హెచ్చరించింది. టెలికం ఆపరేటర్లు సైతం దీనిపై అవగాహన కల్పించాలని సూచించింది. ‘+91తో కాకుండా వేరే కోడ్లతో వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. +8, +85, +65 వంటి స్టార్టింగ్ కోడ్లతో ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేస్తే వెంటనే సంచార్ సాథి పోర్టల్‌లోని <
News December 25, 2024
కొత్త ఏడాదిలో మీ రిజల్యూషన్ ఏంటి?
నూతన సంవత్సరం అనగానే కొత్త మార్పులను చాలా మంది కోరుకుంటారు. డబ్బులు ఆదా చేయడం, స్మోకింగ్, మద్యం మానేయడం, జిమ్‌కి వెళ్లడం, డైటింగ్, స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త ప్రయాణాలు చేయడం వంటి రిజల్యూషన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి కొత్త ఏడాదిలో మీరు ఎలాంటి రిజల్యూషన్ తీసుకుంటున్నారు? కామెంట్ చేయండి.
News December 25, 2024
టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం
AP: పదో తరగతి విద్యార్థులకు SSC పరీక్షల విభాగం మరో అవకాశం కల్పించింది. వివిధ కారణాలతో మార్చి-2025 పరీక్ష ఫీజు చెల్లించని వారికోసం తత్కాల్ విధానం తీసుకొచ్చింది. ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. తత్కాల్లో రూ.1000 ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.శ్రీనివాసులురెడ్డి సూచించారు.