News May 21, 2024
రూ.7.08కోట్ల విదేశీ నిధులు సేకరించిన ఆప్: ఈడీ

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విదేశీ నిధుల సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. 2014 నుంచి 2022 వరకు రూ.7.08 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్‌లను ఆప్ ఉల్లంఘించినట్లు పేర్కొంది. కెనడాలో సేకరించిన నిధులను ఆ పార్టీ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌తో సహా మరికొందరు తమ స్వప్రయోజనాలకు వాడుకున్నారని తెలిపింది.
Similar News
News February 21, 2026
తొలి తెలుగు శిలా శాసనం.. చూశారా?

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కడపలోని(AP) సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో ప్రదర్శించిన తొలి తెలుగు శిలా శాసనం నమూనా స్థూపం ఫొటో నెట్టింట వైరలవుతోంది. క్రీ.శ.575 కాలానికి చెందిన ఈ రేనాటి చోళుల శాసనం.. తెలుగు భాష ప్రాచీనతకు సజీవ సాక్ష్యం. మాతృభాషపై మమకారంతో పలువురు ఈ ఫొటోను షేర్ చేస్తూ మన భాషా వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారు. మన భాషకు ‘ప్రాచీన హోదా’ రావడంలో ఇటువంటి శాసనాలే కీలక పాత్ర పోషించాయి.
News February 21, 2026
260 పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 21, 2026
ఎందుకలా?!: గాలి మనకు కనిపించదు..

ఏదైనా వస్తువు మనకు కనిపిస్తుందంటే దానిపై కాంతి పడి పరావర్తనం(రిఫ్లెక్షన్) చెందిందని అర్థం. అటు ఏ పదార్థం/వస్తువు ఏర్పడాలన్నా అణువుల కలయిక అవసరం. అయితే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వంటి గ్యాసెస్ అణువులున్నా కనిపించకపోవడానికి కారణం వాటి నిర్మాణం. అవి చాలా సూక్ష్మంగా, పారదర్శకంగా ఉంటాయి. దీంతో వాటిపై కాంతి పడినా రిఫ్లెక్ట్ చేయలేవు. ఫలితంగా గాలిని చూడలేం. ప్రతిరోజూ 2pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.


