News May 21, 2024
ఓటేయని మూడు గ్రామాల ప్రజలు

తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ యూపీ, జార్ఖండ్‌లోని మూడు గ్రామాల ప్రజలు ఐదో దశ ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. UPలోని కౌశాంబి(D) హిసామ్‌పూర్, బారాబంకి(D)లోని పరహాజీ వాసులు తమ గ్రామాల్లో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు జార్ఖండ్‌లోని కుసుంబా గ్రామానిది అదే దుస్థితి. అండర్ పాస్ నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
Similar News
News January 8, 2026
నదీ గర్భంలో రాజధాని కట్టట్లేదు: నారాయణ

AP: నదీ గర్భంలో రాజధాని కట్టట్లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జగన్ రెండో దశ భూసేకరణపై చేసిన <<18799615>>కామెంట్ల<<>>పై స్పందించారు. ‘YCP ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి ఆగదు. తప్పుడు ప్రచారం చేస్తే ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. 2వ విడత భూసేకరణలో భాగంగా భూమి ఇవ్వడానికి రైతులు ముందుకొస్తున్న టైంలో ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం. CMగా పని చేసిన వ్యక్తి ప్రజలను పక్కదోవ పట్టించడం సరికాదు’ అని మండిపడ్డారు.
News January 8, 2026
దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంజినీర్స్ సర్టిఫికెట్స్ ఆఫ్ కాంపిటెన్సీ/మెరైన్ ఇంజినీరింగ్ అప్రెంటిస్‌షిప్, BE(ఎలక్ట్రికల్), BLiSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News January 8, 2026
పరకామణిలో సంస్కరణల రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి

AP: <<18777180>>పరకామణిలో సంస్కరణల<<>>పై TTD ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకల లెక్కింపునకు మెరుగైన ప్లాన్స్‌తో రావాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం కిందికి వచ్చే నిందితుడు రవికుమార్, ఆయన ఫ్యామిలీకి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని తెలిపింది. AVSO సతీశ్ మృతిపై విచారణ వేగవంతం చేయాలని చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీకి సూచించింది.


