News May 21, 2024
ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

AP: పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం హింసను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Similar News
News January 7, 2026
కోళ్ల ఫామ్‌లో ఉష్ణోగ్రత, లిట్టర్ నిర్వహణ కీలకం

శీతాకాలంలో రాత్రి ఎక్కువ, పగలు తక్కువ సమయం ఉండటం వల్ల కోళ్ల ఫామ్‌లో ఉష్ణోగ్రత విషయంలో, నేల మీద పరిచే వరిపొట్టు(లిట్టర్) విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టులో తేమ పెరగకుండా 7 నుంచి 11 కిలోల పొడి సున్నం లేదా సూపర్ ఫాస్ఫేట్ 100 చదరపు అడుగుల లిట్టర్‌కు చేర్చాలి. వారానికి 2-3 సార్లు లిట్టర్‌ను కలియబెట్టాలి. ఇలా చేయడం వలన లిట్టర్‌లో తేమ తగ్గి కోడిపిల్లలు కోకిడియోసిస్‌కు గురి కాకుండా కాపాడుకోవచ్చు.
News January 7, 2026
CMERIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMERI)లో 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్+ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు JAN 21వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.37వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.cmeri.res.in
News January 7, 2026
సంచలనం.. చేతులు కలిపిన బీజేపీ-కాంగ్రెస్

ప్రధాన ప్రత్యర్థులైన BJP-INC ఓ స్థానిక ఎన్నిక కోసం చేతులు కలపడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలో ఈ విచిత్రం జరిగింది. అక్కడ 60స్థానాలకుగాను శివసేన(షిండే) 27 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి మ్యాజిక్ ఫిగర్‌కు 4సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో BJP(14), INC(12), అజిత్ NCP(4), ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో BJP అభ్యర్థి తేజశ్రీ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు.


