News May 21, 2024
జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు

TG: తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రేపటి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్‌కు ఎస్.వాణికి జూడాల సంఘం నేతలు నోటీసులు అందజేశారు. స్టైఫండ్స్ ప్రతి నెల సమయానికి ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని, అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని విన్నవించారు.
Similar News
News February 9, 2026
లిప్‌స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా?

లిప్ స్టిక్ లో ఉండే లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. లిప్‌స్టిక్ నిరంతరం ఉపయోగించడం వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి లిప్‌స్టిక్‌ను పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు. కెమికల్స్, పారాబెన్ లేని లిప్‌స్టిక్‌ను మాత్రమే ఎంచుకోండి. లిప్ స్టిక్ వేసుకునే ముందు బేస్ కోసం కన్సీలర్ ఉపయోగించండి. ప్రెగ్నెన్సీలో వాడకపోవడమే మంచిది.
News February 9, 2026
అంబటి రాంబాబుపై 52 కేసులు!

AP: వైసీపీ నేత <<19026518>>అంబటి రాంబాబు<<>>పై రాష్ట్రవ్యాప్తంగా 52 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో 3 పీటీ వారెంట్లను అధికారులు సిద్ధం చేశారని సమాచారం. అటు అంబటిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, 8 రోజుల్లో 36 కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపించింది. మరిన్ని పీటీ వారెంట్లు జారీ చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పాలని ప్లాన్ చేస్తోందని విమర్శించింది. CM CBNపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి అరెస్టయ్యారు.
News February 9, 2026
సైలెంట్ కిల్లర్: భారత్‌లో నలుగురిలో ఒకరికి ‘ఫ్యాటీ లివర్’!

ఇండియా ప్రస్తుతం ఒక సైలెంట్ హెల్త్ క్రైసిస్‌ని ఎదుర్కొంటోంది. డ్రింకింగ్ అలవాటు లేకపోయినా కేవలం ఒబెసిటీ, డయాబెటిస్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ (MASLD) కేసులు దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి నలుగురు అడల్ట్స్‌లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మందికి కాలేయం గట్టిపడటం (Fibrosis) వంటి ప్రమాదకర లక్షణాలు ఇప్పటికే మొదలయ్యాయి.


