News May 21, 2024
IPL.. ఇవాళ ఫైనల్‌కు వెళ్లేదెవరు?
IPL క్వాలిఫైయర్-1లో ఇవాళ SRH, KKR జట్లు తలపడనున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. దూకుడు మీదున్న ఈ జట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ. బ్యాటింగ్, బౌలింగ్‌లో KKR పటిష్ఠంగా ఉంది. బ్యాటర్లు విజృంభిస్తున్నా నిలకడ లేమి బౌలింగ్ SRHకి ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు 2జట్లు 26 సార్లు తలపడగా 17 మ్యాచుల్లో KKR నెగ్గింది.
Similar News
News December 26, 2024
అజెర్‌బైజాన్ విమానాన్ని కూల్చేశారా?
అజెర్‌బైజాన్‌లో నిన్నటి విమాన ప్రమాదం రష్యా దాడి వల్లే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫ్లైట్ అజెర్‌బైజాన్‌లోని బాకు సిటీ నుంచి రష్యాకు వెళ్తుండగా కుప్పకూలింది. ఆ సమయానికి రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. విమానాన్ని ఉక్రెయిన్ దాడిగా పొరబడి రష్యా ఎయిర్ డిఫెన్స్ దాన్ని కూల్చేసి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. విమానం బాడీపై బులెట్ల ఆనవాళ్లుండటం దీనికి ఊతమిస్తోంది.
News December 26, 2024
అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది?: CM రేవంత్
TG: సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టప్రకారం వ్యవహరించాలనేది నా విధానం’ అని రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో వ్యాఖ్యానించారు.
News December 26, 2024
సినీ సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ
TG: సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సినీ పెద్దలు లేవనెత్తిన అంశాలపై చర్చించి నిర్ణయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు, సినీ నిర్మాతలు ఉండే అవకాశముంది. మరోవైపు సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి చర్చిస్తామని దిల్ రాజు తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.