News May 21, 2024
మాటలు రాని పిల్లల కోసం అమ్మ యాప్

TG: వరంగల్ NIT విద్యార్థులు మాటలు సరిగా రాని పిల్లల కోసం అమ్మ పేరుతో ఓ యాప్‌ను రూపొందించారు. తొలిదశలో 50 పదాలతో ఆటల రూపంలో మాటలు మాట్లాడేలా, మాటలు రాని, బుద్ధిమాంధ్యం గల 3-5 ఏళ్లలోపు పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని ఆవిష్కరించారు. చిన్నారులకు త్వరగా మాటలు వచ్చేలా ఈ యాప్ ఒక వ్యాయామంలా ఉపయోగపడుతుందని దాన్ని రూపొందించిన విద్యార్థులు తెలిపారు. త్వరలోనే గూగుల్ ప్లేస్టోర్‌లో దీనిని అందుబాటులో ఉంచనున్నారు.
Similar News
News October 17, 2025
అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు

మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్‌ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.
News October 17, 2025
కంచుకోటలు ఖాళీ అవుతున్నాయి!

బస్తర్, అబూజ్మడ్.. మావోయిస్టులకు కంచుకోటలు. ఎన్నో భీకర ఎన్కౌంటర్లకు వేదికలు. కానీ ఇప్పుడు అక్కడ తుపాకీ మూగబోతోంది. నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో వందల మంది మావోలు మరణించారు. దిక్కుతోచని స్థితిలో అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లాంటివారు కూడా లొంగిపోయారు. అబూజ్మడ్, నార్త్ బస్తర్ మావోరహిత ప్రాంతాలుగా మారాయని, ఇక మిగిలింది దక్షిణ బస్తరేనని అమిత్ షా ప్రకటించారు.
News October 17, 2025
వేంకటేశ్వరుడే మనకు రక్షకుడు

వేంకటాచల మాహాత్మ్యం ‘కలౌ వేంకటో నాయకః’ అని పేర్కొంది. అంటే.. కలియుగంలో వేంకటేశ్వరుడే మనకు రక్షకుడు అని అర్థం. ఆయన ఈ లోకంలోని మన పాపాలను కడగడానికి, కష్టాలనే భవసాగరంలో మునిగిపోతున్న జీవులను ఉద్ధరించి, వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి తిరుమలలో వేంకటపతిగా స్వయంగా వెలిశారు. ఆయన దివ్య దర్శనం మాత్రమే మనకు శ్రేయస్సును, ఉత్తమ గతిని అనుగ్రహిస్తుంది. అందుకే ఈ కలియుగానికి ఆయనే ఏకైక నాయకుడు. <<-se>>#VINAROBHAGYAMU<<>>