News May 21, 2024
HYD: భర్తను వేధిస్తున్న భార్యపై కేసు నమోదు

భర్తను వేధిస్తూ టార్చర్ చేస్తున్న భార్యపై కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు.. APఅమలాపురం వాసి టెమూజియన్ కుముజకు రాజోలు వాసి లక్ష్మీగౌతమితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు HYDఅల్వాల్‌లో వచ్చి ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు. భర్త మల్లారెడ్డి కాలేజీలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అత్తింటి ఆస్తుల కోసం ఆమె.. భర్త, అత్తమామలను వేధిస్తోంది. కత్తితో భర్తపై దాడి చేయగా కేసు నమోదైంది.
Similar News
News January 16, 2026
HYD: సంక్రాంతి.. తేదీ ఎందుకు మారిందో తెలుసా?

మకర సంక్రాంతి పండుగ తేదీల్లో మార్పు వెనుక ఆసక్తికర శాస్త్రీయ కారణం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం ఏటా 20 నిమిషాలు ఆలస్యమవుతోందని HYDలోని ఓ ఖగోళ నిపుణుడు తెలిపారు. దీంతో ప్రతి 72 ఏళ్లకు ఒక రోజు చొప్పున పండుగ తేదీ మారుతోంది. 1935-2007 వరకు జనవరి 14న వచ్చిన పండుగ, 2008 నుంచి జనవరి 15న వస్తోంది. ఈ లెక్కల ప్రకారం 2081లో జనవరి 16న సంక్రాంతి రానుంది.
News January 16, 2026
హైదరాబాద్‌లో AQ @222

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున గాజులరామరంలో 222కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.
News January 16, 2026
HYD నగరానికి పెరుగుతున్న వలసలు.. కారణం ఇదేనా!

HYDకు వలసలు ఆగటం లేదు. నగర విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిధిలో జనాభా ఇప్పటికే సుమారు 1.4 కోట్లకు చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఉపాధి, విద్య, వైద్య, ఐటీ రంగాల్లో అవకాశాలు, బతుకుదెరువు కోసం ప్రధాన కారణంగా నగరానికి నిరంతర వలస కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, నివాస వసతులపై ఒత్తిడి పెరుగుతోంది.


