News May 21, 2024
USలో ఇండియా ‘జనరిక్స్’దే హవా

తక్కువ ధరకు జనరిక్ మందుల సరఫరాలో భారత కంపెనీలు సత్తా చాటుతున్నాయి. 2022లో USలోని రోగులు వినియోగించిన మొత్తం జనరిక్స్‌లో 47% మన కంపెనీలవే. మానసిక రుగ్మతలు, హైపర్ టెన్షన్, లిపిడ్ రెగ్యులేటర్స్, యాంటీ అల్సర్స్, డయాబెటిస్ సంబంధ మందులు ఎక్కువగా వాడుతున్నారట. దీనివల్ల 2022లో US హెల్త్ డిపార్ట్‌మెంట్ 219 బిలియన్ డాలర్లు ఆదా చేయగలిగింది. 2013-2022 మధ్య ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లను పొదుపు చేసింది.
Similar News
News February 13, 2026
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా

TG: నల్గొండ జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను సొంతం చేసుకుంది. అటు సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్లలోనూ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తిరుమలగిరిలో BRS గెలిచింది.
News February 13, 2026
స్కూళ్లను బాగు చేస్తే ప్రమాణాలు ఎందుకు దిగజారాయి: లోకేశ్

AP: స్కూళ్లలో సదుపాయాల కోసం ₹7500 CR ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. ‘18 అంశాల్లో స్కూళ్లకు రేటింగ్ ఇవ్వగా 40% 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి. 84.3% 3వ తరగతి, 62.5% 5వ తరగతి, 47% 8వ తరగతి విద్యార్థులు 2వ క్లాస్ పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. YCP హయాంలో అద్భుతంగా చేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంతలా ఎందుకు పడిపోయాయి’ అని ప్రశ్నించారు. వీటిని మెరుగుపరుస్తామని చెప్పారు.
News February 13, 2026
సిరిసిల్లలో BRS విజయం, ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.


