News May 21, 2024
కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ: పొంగులేటి

TG: ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ‘అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తాం. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’ అని ఆయన హామీ ఇచ్చారు.
Similar News
News November 10, 2025
గిరాకీ లేని టెస్లా.. అక్టోబర్‌లో అమ్మింది 40 కార్లే

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ కార్లకు ఇండియాలో పెద్దగా గిరాకీ కనిపించడం లేదు. దేశంలో జులైలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 104 కార్లే విక్రయించింది. అక్టోబర్‌లో 40 కార్లు మాత్రమే అమ్మగలిగింది. ఒకే మోడల్, రెండే స్టోర్లు, దిగుమతి చేస్తుండటం, అధిక ధరలే కారణమని తెలుస్తోంది. మరో విదేశీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఇక్కడే తయారు చేసి, తక్కువ ధరలకే ఎక్కువ కార్లను విక్రయిస్తోంది.
News November 10, 2025
కర్రపెండలంలో బోరాన్ లోపం, నివారణ

కర్రపెండలంలో బోరాన్ లోపం వల్ల మొక్కల కణుపుల మధ్య దూరం తగ్గి, మొక్కల పెరుగుదల అంతగా ఉండదు. లేత ఆకులు కుచించుకుపోతాయి. గోధుమ రంగులో జిగురు పదార్ధం ఆకుల కాడలు, కాండం మొవ్వభాగంలో కనిపిస్తుంది. వేరు వ్యవస్థ పెరుగుదల దెబ్బతిని, మొవ్వభాగం ఎండి, దుంపలపై పగుళ్లు వస్తాయి. ఈ లోప నివారణకు ఎకరాకు 4KGల బోరాక్స్ భూమిలో వేసి కప్పాలి. ముచ్చెలను 1% బోరాక్స్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తర్వాత నాటాలి.
News November 10, 2025
హనుమాన్ చాలీసా భావం – 5

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||
హనుమంతుని ఒక చేతిలో ఎంతటి శత్రువునైనా మట్టుబెట్టేంత శక్తి కలిగిన వజ్రాయుధం(గద), మరో చేతిలో విజయానికి ప్రతీకైన పతాకం ప్రకాశిస్తుంటాయి. ఆయన భుజంపై ఉండే జంధ్యం ఆయన అపారమైన శక్తి, విజయం మరియు, సూచిస్తుంది. మనం కూడా హనుమంతునిలా ధైర్యాన్ని, సత్యాన్ని ఆశ్రయిస్తే జీవితంలో తప్పక విజయం సాధిస్తాం. <<-se>>#HANUMANCHALISA<<>>


